మన న్యూస్,కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వర పల్లి గ్రామ చివర్లో
ప్రభుత్వ అధికారులు సర్వే చేసి హద్దులు చూపించినప్పటికీ అధికారులు చేసిన సర్వే సర్వే కాదని హద్దులను మీరి భూమిని చదును చేస్తూ మమ్ములను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వడ్ల కళావతి కుమారులు ఆవేదన వ్యక్తం చేశారు, వడ్ల కళావతి మాట్లాడుతూ మా యొక్క భూమి, సర్వే నంబర్ 143/2A లో 27 గుంటల భూమి పట్ట పాస్ బుక్కులో ఉందని మాకు భూమి 24 గుంటలు మాత్రమే ఉందని, 3 గుంటల భూమి తక్కువ వస్తుందని మేము డిడి కట్టి ప్రభుత్వ అధికారులచే సర్వే చేయించుకోవడం జరిగిందని. సర్వే అధికారి వచ్చి చుట్టుపక్క వారి వారి ముందే సర్వే చేసి హద్దులు చూపించినప్పటికీ ఆ సర్వే సరికాదని అంతేకాకుండా గత సంవత్సరములో అదే గ్రామానికి చెందిన పెద్దల సమక్షంలో మాట్లాడుకోవడం జరిగిందని వారు వ్రాసిన పత్రము కూడా లెక్కచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు చేసిన సర్వే ను కూడా సర్వే కాదు సర్వే కాదు అని సర్వే అధికారులను దుర్భాషలు మాట్లాడితే మా యొక్క సమస్యలు మేము ఎవరికీ చెప్పుకోవాలని ఆమె వాపోయారు,
కుమారులు రమేష్ నాగరాజు మాట్లాడుతూ
మా యొక్క సొంత భూమిలో బోరు వేసుకొని కరెంటు కొరకు కూడా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని కావాలనే మాపైన విద్యుత్ అధికారులతో మాపై కేసు కూడా వేయడం జరిగిందని విద్యుత్ డిడి కట్టినప్పటికీ కూడా మాపై కేసు చేసి ఇబ్బందులకు గురి చేయడం జరిగిందని మా యొక్క సొంత భూమిలో మాకు భూమి తక్కువ ఉందని మేము సర్వే డీడీ ని కట్టుకొని సర్వే అధికారులతో సర్వే చేయించుకున్నప్పటికీ ఈ వ్యక్తులు? కావాలనే మాపై కక్షపూరితంగా కక్ష కట్టి భూమి పంట వేసుకోకుండా దౌర్జన్యగా మాపై దాడికి వస్తున్నారని సర్వే అధికారులు సర్వే చేసి మాకు సర్వే పత్రము కూడా ఇవ్వడం జరిగిందని అయినా వీరు మమ్ములను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వీరి పైన జిల్లా కలెక్టర్ ఆర్డీవో ఎమ్మార్వో స్పందించి విరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాకు న్యాయం చేయాలని కోరుతున్నామని అన్నారు.