మనన్యూస్,సాలూరు: పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లో ప్రజల సంక్షేమమే నా ధ్యేయమే,కూటమీ ప్రభుత్వం కృషి వలన ఆరు నెలల్లోనే నియోజకవర్గలో 100 పైగా సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మించు కుంటున్నామని, ప్రజలకు అభివృద్ధి అందించేలా మరో కొత్త అడుగు వేస్తున్నామని,ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సోమవారం నియోజకవర్గంలో ఉన్న సాలూరు, మక్కువ, పాచిపెంట, మెంటాడ మండలంలో 100 సిసి రోడ్లను ఆమె ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారులు లేక ప్రజలకు ఇబ్బందులు పడ్డారని ఈ కొత్త రోడ్లు నిర్మించడం వల్ల వారికి సౌకర్యముగా ఉంటుందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో గిరిజన గ్రామాల్లో.ఈ రోడ్లు నిర్మాణం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా మక్కువ మండలం కాశీపట్నంలో,సాలూరు మండలం తోనాంలో రోడ్లు ప్రారంభోత్సవాలు చేశారు.మండలాల వారీగా రోడ్డు వివరాలు ఆమె తెలియజేశారు.సాలూరు మండలం - 18
పాచిపెంట 27 మక్కువ- 35 మెంటాడ- 22 పనులు ప్రారంభించామని తెలిపారు
ప్రభుత్వం కృషి ఈ ఆరు నెలల కంటే తక్కువ వ్యవధిలోనే సీసీ రోడ్లు, బీటి రోడ్లు నిర్మించడం ద్వారా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రివర్యులు స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో సాలూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యావరణ స్నేహపూర్వక రహదారులను నిర్మించడం జరిగిందని ఆమె అన్నారు.గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి గ్రామసభల ద్వారా ప్రజల అంగీకారంతో రోడ్లకు ప్రతిపాదనలు చేశామని మంత్రి తెలిపారు.ప్రాథమిక సదుపాయాలు,విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు,రోడ్ల అభివృద్ధి.తోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు.రహదారి సౌకర్యం లేక ఇబ్బంది పడిన ప్రజలకు ఈ రోడ్లు కొత్త దిశను చూపిస్తుందని ఆమె తెలిపారు.ఈ కూటమి ప్రభుత్వానికే ఈ రకమైన అభివృద్ధి సాధ్యం అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలియజేశారు.సాలూరు నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమం నా ధ్యేయం అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాదం, మద్దతు ఈ అభివృద్ధికి పునాది అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఈ కార్యక్రమంలో సాలూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పరమేశు, మక్కువ మండల తెలుగుదేశం నాయకులు శ్యాము తవుడు. రాంపల్లి రజిని. అన్నపూర్ణమ్మ. పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.