మన న్యూస్,తిరుపతి: గత ప్రభుత్వ పాలనలో పి ఆర్ సి లు డిఏలు ఎన్నో కోల్పోయిన కనీసం ఉపాధ్యాయులకు ఆత్మగౌరవం కూడా లేకుండా చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టిన పాలనకు చరమ గీతం పాడి కోటి ఆశలతో కొత్త ప్రభుత్వం వైపు ఎదురుచూసిన లక్షల మంది ఉద్యోగులకు పెన్షనర్లకు ఆరు నెలలు గడిచిన కనీసం ఒక్క డీఏ కూడా ప్రకటించకనే ఆరు మంత్రివర్గ సమావేశాలు గడిచిపోవడం ఉద్యోగులను పెన్షనర్లు నిరాశపరచడమే అన్ని ఆర్.జి.పి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు టి గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నో వర్గాలకు ఎన్నో వరాలు ప్రకటిస్తున్న ఉద్యోగులు పెన్షనర్లను కూడా నమ్మకం లేక తీసుకొని దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న డి ఏ లను పిఆర్సి అరియర్స్లను రిటైర్డ్ ఉద్యోగులకు బకాయి పడ్డ గ్రాట్యూటీ ఇతర ఆర్జిత సెలవులు అర్థ జీతపు సెలవులు నగదు మార్చుకునే బకాయిలను చెల్లించే ప్రయత్నం చేయాలని రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు టి గోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆర్ జె యు పి 2025 నూతన క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ కొత్త సంవత్సరంలోనైనా ఎన్నో ఆశలు ఎదురుచూస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులు పట్ల సానుకూల దృక్పథం కూటమి ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేసినారు ఈ కార్యక్రమంలో ఆర్జెయుపి నాయకులు హరికృష్ణ బాబు భువనేశ్వర్ వెంకటాచలపతి వెంకటనారాయణ పెద్దపాలెం పాపయ్య నాయుడు సుబ్రహ్మణ్యం డాక్టర్ నిడుదాల రవణప్ప శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు అనంతరం తిరుపతి జిల్లా ఖజానా శాఖ అధికారి ఎం లక్ష్మీకర్ రెడ్డి,సీనియర్ సబ్ ట్రెజరీ ఆఫీసర్ పార్థసారథి చేత ఆర్జెయుపి క్యాలెండర్ను ఆవిష్కరింప చేశారు