
ఎల్ బి నగర్. మన న్యూస్ :- సమస్త మానవ కోటి సుఖశాంతులతో జీవించాలని లోక కళ్యాణార్థం తుర్కయంజాల్ మున్సిపాలిటీ బ్రాహ్మణపల్లి పరిణయ కన్వెన్షన్ హాల్లో శనివారం శ్రీ పద్మావతి పరిణయ 9వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. మొల్లూరి నవీన్ శర్మ ఆధ్వర్యంలో సాగర్ కాంప్లెక్స్ శ్రీ రేణుక రేణుక రాజరాజేశ్వరి పీఠం సభ్యుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏనుగుపై శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వార్ల విగ్రహాలను కళ్యాణ మండపం వరకు ఊరేగింపుగా తీసుకొని వచ్చారు.వందలాది మంది భక్తులు కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొని తరించారు.ఈ కార్యక్రమంలో బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, ఏడు దొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి, శర్మ, జితేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నర్సిరెడ్డి, భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి భారీగా వచ్చిన భక్తుల కోసం నిర్వాహకులు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.