చంపాపేట్-: మన న్యూస్ :- చంపాపేట్ కార్పోరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా పవన్ పురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్పొరేటర్ నివాసంలో జరిగింది .ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, డివిజన్ ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ, ప్రజా సేవలో మరింతగా ముందుకెళ్తూ చంపాపేట్ డివిజన్ ను అభివృద్ది పథంలో తీసుకెళ్తానని చెపుతూ పవన్ పురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు కాలనీవాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోరెడ్డి రవీందర్ రెడ్డి, అధ్యక్షులు జి యాదయ్య, ప్రధాన కార్యదర్శి డి. నర్సిరెడ్డి, కోశాధికారి యల్. మాధవరెడ్డి, భాస్కరా చారి, సత్య నారాయణ రెడ్డి పవన్ పురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.