రాజకుమార రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్
కళాశాలలో అవసరం అయ్యే మౌలిక వసతులను ఏర్పాటు చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ థామస్
మన న్యూస్, ఎస్ఆర్ పురం :-
కార్వేటి నగరం మండలం కార్వేటి నగరం రాజకుమార్ స్వామి రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ చేతుల మీదుగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల కళాశాలలో చదివే విద్యార్థులకు చదువుతోపాటు నాణ్యమైన భోజన అందించాలని భావనతో కూటమి ప్రభుత్వం మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది నేడు కార్వేటినగరం లో ప్రారంభించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా జూనియర్ కళాశాలకు అవసరమయ్యే మౌలిక వసతులు ఏర్పాటు చేసి కళాశాల అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం భోజనాన్ని స్వయంగా వడ్డించి సహబంతి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, కళాశాల ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.