మన న్యూస్,కామారెడ్డి,సదశివానగర్: తెలంగాణ ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల కాబడింది కావున పూర్వపు సదాశివ నగర్ మండల పరిధిలో ఉన్నటువంటి వివిధ గ్రామాల్లో ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు మనవి ఏమిటంటే ఆరవ తరగతికి తెలంగాణ ఆదర్శ పాఠశాల సదాశివ నగర్ యందు ప్రవేశం పొందడానికి ప్రవేశ పరీక్ష 13 ఏప్రిల్ 2025 రోజున నిర్వహించబడును కావున ఈ పరీక్షకు హాజరు అయి ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఆరు జనవరి 2025 నుండి 28 ఫిబ్రవరి 2025 వరకు ప్రవేశ పరీక్షకు అప్లికేషన్ చేసుకోవాలి అప్లికేషన్ చేసుకోవడానికి కావలసిన ధ్రువపత్రాలు,ఒకటి ప్రస్తుతం చదువుతున్న సంబంధిత పాఠశాల నుండి బోనఫైడ్ తీసుకోవాలి,రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ను ఎస్సీ, ఎస్టీ బీసీ విద్యార్థులు పరీక్ష ఫీజు 125 రూపాయలు చెల్లించాలి ఓసి విద్యార్థులు 200 రూపాయలు చెల్లించాలి,అలాగే ఎడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు కూడా దరఖాస్తు చేసుకోవాలని కోరడం జరుగుతుంది,దరఖాస్తు చేసుకోవడానికి కింది,వెబ్సైటును,సంప్రదించండి,telanganams.cgg.gov.in