మన న్యూస్ సదాశివ పెట్ జనవరి 03:25, సంగారెడ్డి జిల్లా,సదాశివ పెట్ మండలంలోని కోనాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆమె జయంతిని మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది,ఈ సందర్భంగా కోనాపూర్ బక్కప్ప,మాట్లాడుతూ మహిళల సమానత్వం కోసం మహిళా అభ్యున్నతి కోసం,ఉద్యమం చేసిన సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే,శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని మహిళ ఉపాద్యాయులకు సన్మానించారు,భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే,మహిళలకు విద్యను సులభతరం చేసేందుకు విశేషంగా కృషి చేశారని కొనియాడారు. విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు, ఆమె కవిత ద్వారా అణగారిన వర్గాలకు విద్యాభ్యాసం గొప్పతనాన్ని వివరిస్తూ ప్రోత్సహించిందన్నారు,మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ప్రస్థానం ప్రారంభించిన ఆ మహనీయురాలు తర్వాత కాలంలో అనేక పాఠశాలలను ప్రారంభించి మహిళా విద్యను ప్రోత్సహించిందని తెలియజేశారు,ఆమె సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఆమె జయంతి అయిన జనవరి 3 వ తేదీని ప్రతి ఏట మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిందని స్పష్టం చేశారు…
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుధాకర్,విట్ఠల్,అటుగారి మణయ్య,నర్సింలు, మొగులయ్య, కన్నసాయి,మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు…