మనన్యూస్:గొల్లప్రోలు,రాష్ట్రంలోమద్యం కొనుగోళ్లు అమ్మకాలు సేవించేవారు ఎక్కువై నట్లుగా ఎక్సైజ్ శాఖ ప్రకటించిన గణాంకాల ద్వారా వెల్లడవుతోంద ని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు.10సంవత్సరాల బాలురకు మద్యం మత్తు పదార్థాలు అందుతున్నదుస్థితి,ఎక్కువయ్యిందన్నారు.నూతన సంవత్సరం రోజున రూ.200కోట్ల మద్యం సేవించిన ఆంధ్ర పౌరుల తీరుపై కలత చెందిన మద్యపాన వ్యతిరేక పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ జనవిజ్ఞాన వేదిక ప్రతినిధి పేద ప్రజల వైద్యుడు నక్కా సూర్యనారాయణపిఠా పురం ఎంఆర్ వో కార్యాలయం వద్ద,నిరాహారదీక్షచేయడం,మద్యపానవిమోచనంఆశించే ఆలోచనలకు కల్పించే ఆశయ మన్నారు. సూర్యనారా యణతో బాటుగా దీక్షలు చేపట్టిన మహిళలను నాయకులను అభినందించారు. మద్యం దుకాణాల వద్ద లూజు విక్రయాలు మద్యపాన సేవనం జరగకుండా కఠిన నిర్ణయాల అమలు జరగాలన్నారు.బాలలకు మద్యం అమ్మకాలు సరఫరా అందుబాటులో లేకుండా చూడాలన్నా రు.మద్యం అమ్మకాల్లో పది శాతం నిధులు వెచ్చించి మద్య విమోచనం కల్పించే డ్రగ్ డీ-అడిక్షన్ అండ్ కౌన్సిలింగ్ కేంద్రాలు ప్రతి మండలంలో నెలకొల్పేలా మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోవాల న్నారు.మద్యం బ్రాండ్ కంపెనీల పేరిట మంచినీరు బాటిల్స్ అమ్మకాలు పూర్తిగా నిషేధం చేయాలన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రసార ప్రచార ప్రకటనల్లో వాణిజ్య ప్రకటనలకు అనుమతులు ఇవ్వడం మంచి విధానం కాద న్నారు.ఇటువంటి ప్రకటనలు యువకుల ను మద్యపానం వైపు దృష్టి మల్లిస్తున్న దుస్థితి వుందన్నారు.సచివాలయం స్థాయి నుండి మద్య పాన విమోచన కమిటీలు ఏర్పాటుచేసి మద్యపాన సేవనం రుగ్మతలు రూపుమాపే సంస్కరణలు అమలు చేయకుంటే రాబోయే భవిష్యత్ తరం 30ఏళ్ల కే మద్యం మత్తు రుగ్మతల అనారోగ్యా లతో మరణించే ప్రమాదం వుందన్న జాతీయ అంతర్జాతీయ సర్వే రిపోర్టులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.డాక్టర్ పి ఎన్ రాజు నయన బాబు కామగిరి తలుపులమ్మ కోనేటి రాజు గుబ్బల రాజు ఎం అమృత సతీష్ పావని వేమగిరి రమెష్ ఏసయ్య చిన్నారి భవాని మరియమ్మ పౌర సంఘం సభ్యుడు పులి సతీష్ పాల్గొన్నారు .