మనన్యూస్:వెదురుకుప్పం మండలంలోని డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత కేంద్రం,ఐక్యూఏసీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి అన్నపూర్ణ శారద మాట్లాడుతూ మహిళా హక్కుల గురించి విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది,విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.