మనన్యూస్:తిరుపతి, ప్రపంచంలో మహిళలు విద్యావంతులైతే సమాజం మొత్తం సిరిసంపదలేనని పలువురు వక్తలు పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం జీవకోన జడ్పీ హైస్కూల్లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది.హెడ్మాస్టర్ సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తిరుపతి రామకృష్ణ మఠం స్వామీ సత్వస్తనంద మహారాజు చిన్నారులను ఉపాధ్యాయులను ఆశీర్వదించారు.ఆధ్యాత్మిక భావాలు,హిందూ భావజాలాలు, సనాతన ధర్మాల గురించి చిన్నతనం నుంచే తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.స్థానిక వ్యక్తిత్వ వికాస నిపుణులు జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థుల్లోని నిగూఢమైన శక్తిని వెలికి తీసి వారి ప్రగతికి ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలి అన్నారు.ఈ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో టీచర్లను ఘనంగా సన్మానించి,పుస్తక ప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో జి వెంకటేశ్వర్లు,చైతన్య విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.