ఎల్ బి నగర్.. మన న్యూస్ :- ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తన కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కలిసి పుష్పగుచ్చం అందజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ, ప్రజా సేవలో మరింతగా ముందుకెళ్తూ,ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపాల్ ,మధు సాగర్, వినోద్, లోహిత్ ,సాగర్, పాల్గొన్నారు