(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు సావిత్రిబాయి పూలే జయంతిని ఉమెన్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.సునీత అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే గొప్ప భారతీయ సంఘ సంస్కర్త,ఉపాధ్యాయిని,రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య.కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి.ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన వ్యక్తి అని, 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది.కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా,శూద్రుల,అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా విశ్వసించారని. తన ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసిన మహా మహిల అని,సమాజంలోని కులతత్వం,పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణియని కొనియాదారు. ప్రతి విద్యార్థి సావిత్రిబాయి పూలే గారిని ఆదర్శంగా తీసుకొని సమాజం కోసం పనిచేయాలని కోరారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ కన్వీనర్ కే. శ్రీలక్ష్మి,కమిటీ సభ్యులు కుమారి మేరీ రోజులైనా, సిహెచ్ పుష్ప, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రయాగ మూర్తి ప్రగడ, అధ్యాపకులు వీరభద్రరావు, సతీష్ అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.