మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కే ఎస్ ఎస్ రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులకు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని,డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకాన్ని ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభరాజా ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు చెప్పి తూచా తప్పకుండా కళాశాలకు ప్రతిరోజు పంపించాలని,విద్యార్థులు చదువులు పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఈ పథకాన్ని ప్రతి విద్యార్థి వినియోగించుకోవాలని ఆయన కోరారు.