మన న్యూస్:కామారెడ్డి జిల్లా,పాల్వంచ మండలం భవానిపేట, గ్రామంలో ఆదివారం సోమవారం శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతాయని గ్రామ ఉప సర్పంచ్ రమేష్ గౌడ్ అన్నారు,ఆదివారం రోజున శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు తీయడం జరుగుతుందని సోమవారం బండ్ల ఊరేగింపు చక్కెర తీర్థం వంటి ప్రత్యేక పూజల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లాలో ఉన్న మండలాలలో ఉన్న వివిధ గ్రామల భక్తులు ప్రజలు బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరారు.