మనన్యూస్:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోఎరువులు ఉపయోగాలను తెలుసుకుని సరైన సమయానికి సరైన పద్ధతిలో రసాయన ఎరువులను వినియోగించుకోవాలని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు.మండలం తాడూరు గ్రామంలోపొలం పిలుస్తోంది కార్యక్రమంలో మాట్లాడుతూ నత్రజని ఎరువు యూరియా రూపంలో వేస్తున్నారని పెరుగుదలకు ఉపయోగపడుతుంది.కాబట్టి మూడు దశలలో సిఫారసు చేసిన మోతాదులో యూరియాను వేసుకోవాలని భాస్వరం ఎరువు వేరు వ్యవస్థ వృద్ధికి ఉపయోగపడుతుందని కాబట్టి విత్తనం తో పాటు లేదా ఆఖరి దుక్కిలో లేదా విత్తనం నాటిన వారం రోజులు లోపు మాత్రమే డి ఏ పి లేదా 20-20-0-13 వంటి కాంప్లెక్స్ ఎరువులను వేసుకోవాలని పొటాష్ ఎరువు పంట ఆరోగ్యానికి దిగుబడికి మరియు నాణ్యతకు సంబంధించిన ఎరువు కాబట్టి నిర్ణీత మోతాదును రెండు భాగాలుగా చేసి విత్తనంతో పాటు ఒక భాగం పూత దశలో రెండవ భాగం వేసుకోవాలని తెలిపారు విచక్షణ రహితంగా ఎరువులు వాడితే ఖర్చు పెరిగి దిగుబడి తగ్గడమే కాకుండా భౌతిక మరియు రసాయనక స్వభావం దెబ్బతింటుందని తెలిపారు ఏకపంట విధానాన్ని విడిచిపెట్టి చేసుకోవాలని సూచించారు అనంతరం మొక్కజొన్న క్షేత్రాన్ని సందర్శించారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు రైతులు పాల్గొన్నారు.