తవణంపల్లె జనవరి 1 మన న్యూస్
పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం, అరగొండ గ్రామంలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం లో అరగొండ ఎంపీటీసీ జి కరీం సర్పంచ్ పాల్గొన్నారు అరగొండ,పైమాఘం, చారాల, బీసీకాలనీ,నల్లపరెడ్డిపల్లి, తడకర, మత్యం, సహా పలు గ్రామాల ప్రజలు మత్యం క్రాస్ నుండి సుమారు 200 బైక్ లలో ర్యాలీ గా ఎంపీటీసీ జి కరీం ను ఆహ్వానించి అరగొండ కొత్త బస్టాండ్ లో కరీమ్ బ్యానర్ కు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం కరీమ్ ఆయన కుమారుడు సుమారు 50 కేజీల కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అరగొండ పరిసర గ్రామస్తుల నడుమ ఎంతో ఉత్సాహభరితంగా ఈ వేడుకలు జరిగాయి. జి కరీం మాట్లాడుతూ.. "నూతన సంవత్సరంలో ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు కలగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను సాధించి ముందుకు సాగాలని నా హృదయ పూర్వక శుభాకాంక్షలు" అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లుదోరై, ప్రశాంత్ కుమార్,అరగొండ, పైమాఘం, చారాల, బీసీకాలనీ, నల్లపరెడ్డిపల్లి, తడకర,మత్యం పరిసర గ్రామస్తులు పాల్గోన్నారు.