తవణంపల్లె జనవరి 1 మన న్యూస్
పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం, దిగువమాఘం గ్రామంలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం సాయంత్రం మాజీమంత్రి గల్లా అరుణ కుమారి నివాసంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి , మాజీ ఎంపీ గల్లా జయదేవ్ , పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ పాల్గోని కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ ఎంతో ఉత్సాహభరితంగా ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ.. "నూతన సంవత్సరంలో ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు కలగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను సాధించి ముందుకు సాగాలని నా హృదయ పూర్వక శుభాకాంక్షలు" అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.