పోటెత్తిన అభిమానం డాలర్స్ కార్యాలయంలో సందడే సందడి సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన దివాకర్ రెడ్డి అభిమానులు, టిడిపి కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలుతో ముంచెత్తిన యువత, కార్యకర్తలు అభిమానముతో తడిసి ముద్దయిన రాజకీయ నేత, సేవా తత్పరుడు, పేదల పక్షపాతి డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి అభిమానాన్ని గుండెల్లో దాచుకుంటా ప్రతి కార్యకర్తకు, అభిమానికి అండగా ఉంటా ప్రతి కుటుంబం కొత్త ఏడాదిలో అభివృద్ధి పథంలో నడవాలి టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి ఆకాంక్ష అభిమానానికి నిలువుటద్దం డాలర్స్ గ్రూప్ అధినేత,రాజకీయ ఉద్దండుడు, పేదల పక్షపాతి డాక్టర్ సి దివాకర్ రెడ్డి అని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు,టిడిపి కార్యకర్తలు కొనియాడారు. నూతన సంవత్సరం లో భాగంగా బుధవారం స్థానిక డాలర్స్ గ్రూప్ కార్యాలయం అభిమానులు కార్యకర్తలతో సందడిగా మారింది.ఆరాధ్య దైవంగా భావించే తమ నాయకుడికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు యువత ప్రజలు కార్యకర్తలు క్యూ కట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన ఏడాదిలో అభిమాన నాయకుడు డాక్టర్ సి దివాకర్ రెడ్డి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపామన్నారు.పేదల పక్షపాతిగా ముద్రపడ్డ సేవా తత్పరుడికి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.వెల్లువెత్తిన అభిమానంతో డాక్టర్ సి దివాకర్ రెడ్డి తడిసి ముద్దయ్యారు అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుంటా నూతన సంవత్సర సందర్భంగా వ్యయ ప్రయాసల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి టిడిపి కార్యకర్తలు,తన అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో విచ్చేసి శుభాకాంక్షలు తెలపడం ఆనందంగా ఉందని టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి డాలర్స్ గ్రూప్ అధినేత డాక్టర్ సి దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఇంతటి అభిమానాన్ని చూపిన ప్రతి వ్యక్తిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని చెప్పారు. ప్రతి కార్యకర్తకు అభిమానికి ఏ సమస్య తలెత్తిన అండగా నిలబడతానని హామీ ఇచ్చారు.ప్రజల అభిమానంతో,సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఆశీస్సులతో స్థానిక నాయకులను కలుపుకొని ప్రజా సంక్షేమానికి పాటు పడతానని ఈ సందర్భంగా ఆయన అభిమానులకు తెలియజేశారు.నూతన ఏడాదిలో ప్రతి కుటుంబంలోనూ వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.తిరుపతి,రూరల్,చంద్రగిరి ప్రజానీకానికి ఈ సందర్భంగా ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు