బంగారుపాళ్యం,డిసెంబర్ 31 మన న్యూస్
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలపరిధిలోని తుంబపాళ్యం గ్రామపంచాయతీలో మంగళవారం తాసిల్దార్ బాబు రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ తుంబపాల్యం రెవెన్యూ సదస్సులో రైతుల నుండి12 అర్జీలు వచ్చాయని, వాటన్నింటినీ నిర్నీత కాల వ్యవధిలో పరిష్కరిస్తామని తెలిపారు.ఈకార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ మధుసూదన్,మండల సర్వేయర్ లావణ్య,టిడిపి నాయకులు కోదండ యాదవ్, సిద్దయ్య మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.