మన న్యూస్:గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డ్ ను వేరే ప్రాంతానికి తరలించాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు.గొల్లప్రోలు నగర పంచాయతీ సాధారణ సమావేశం మంగళవారం చైర్ పర్సన్ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో వైస్ చైర్ పర్సన్ గంధం నాగేశ్వరరావు,కౌన్సిలర్ బెందుకుర్తి సత్తిబాబుతో సహా పలువురు సభ్యులు మాట్లాడుతూ ఎస్సీ కాలనీకి వెళ్లే రహదారికి ఇరువైపులా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఎంపీడీవో కార్యాలయం,పి.హెచ్.సి పక్కనే చెత్త వేయడం వల్ల దుర్వాసనతో రోగులు,ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు.డంపింగ్ యార్డ్ ను వేరే ప్రత్యామ్నాయ స్థలంలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు మార్పు చేయకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదే సమయంలో డంపింగ్ యార్డ్ నుండి వచ్చే దుర్వాసన భరించలేకపోతున్నామంటూ కొత్తపేట, ఎస్ సి కాలనీకి చెందిన ప్రజలు సమావేశపు హాల్లోకి వచ్చేందుకు ప్రయత్నించగా అధికారులు, సిబ్బంది వారిని సముదాయించి బయటకు పంపించారు 3వ వార్డు కౌన్సిలర్ మైనం భవాని మాట్లాడుతూ జగన్ కాలనీకి ట్యాంకర్ ద్వారా తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదన్నారు. మంచినీటి సరఫరా కాంట్రాక్టును తక్కువ మొత్తంలో టెండర్ వేసి దక్కించుకుంటున్నారని ఆ తర్వాత ట్యాంకర్ ద్వారా ప్రజలకు నీరు ఇవ్వకుండా వాటిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తూ వ్యాపారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు.తాటిపర్తి నుండి గొల్లప్రోలు వరకు ఏర్పాటు చేసిన పైప్ లైన్ వల్ల ఇప్పటికైనా తాగునీటి సమస్య తీరుతుందా అని ప్రశ్నించారు. దీనిపై ఏఈ ప్రభాకర్ వివరణ ఇస్తూ పైప్ లైన్ వేయడంతో పాటు కొత్తగా మోటార్లు బిగించడం వల్ల నీటి సరఫరాకు సమస్య ఏర్పడదన్నారు టిడిపి కౌన్సిలర్ గుళ్ల సుబ్బారావు మాట్లాడుతూ చెత్తను తరలించే కంపాక్టర్ మరమ్మత్తు కు గురై 4 నెలలు అవుతున్నా ఇంతవరకు రిపేరు చేయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కంపాక్టర్ రిపేర్ కు 15వేల రూపాయలు వెచ్చించకుండా అదనంగా ట్రాక్టర్లు ఏర్పాటు చేయవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.దీనిపై ఎ ఇ వివరణ ఇస్తూ కంపాక్టర్ రిపేరు చేయిస్తున్నామని త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు ఈ సమావేశంలో వైస్ చైర్ పర్సన్ తెడ్లపు అలేఖ్య రాణి,కౌన్సిలర్లు గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి,గంటా అప్పలస్వామి, మొగలి దొరబాబు, దాసం దేవి,సింగం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.