మన న్యూస్:గొల్లప్రోలులో ని డాక్టర్ మలి రెడ్డి వెంకటరాజు మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు,ఆట వస్తువులు పంపిణీ చేశారు మంగళవారం ప్రవాస భారతీయురాలు డాక్టర్ పసుపులేటి అవంతి,ఆమె కుటుంబ సభ్యులు పాఠశాలను సందర్శించి తరగతి గదులను పరిశీలించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల విద్యార్థులు, భవిత సెంటర్ విద్యార్థులు,అంగన్వాడి విద్యార్థులకు పుస్తకాలు పలకలు,పెన్సిళ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.సమావేశంలో డాక్టర్ అవంతి మాట్లాడుతూ తన తండ్రి గారి పేరిట ఏర్పాటు చేసిన ఈ పాఠశాల అభివృద్ధికి తాను తమ కుటుంబ సభ్యులు తగిన సహకారం అందజేస్తామన్నారు.ఈ సమావేశంలో ప్రవాస భారతీయులు పసుపులేటి మధుసూదన్ రావు, గ్రేగ్ గిజ్ వా,లత,లావణ్య,జీవన్,వివేక్,కుర్ర నారాయణరావు,స్వామి వివేకానంద జ్ఞాన మందిరం వ్యవస్థాపకులు పడాల కన్నారావు,స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ పి కృష్ణవేణి,పాఠశాల అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ మలిరెడ్డి నారాయణరావు,కార్యదర్శి కొమ్ము సత్యనారాయణ, చేదులూరి సత్యనారాయణ, మైనం రాజశేఖర్, మొగలి సుభద్ర, పాఠశాల ప్రధానోపాధ్యాయుని రెహమాన్ బీ, పలువురు ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.