మనన్యూస్:పాచిపెంట పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో పెద్ద చీపురు వలస తెలుగుదేశం ప్రభుత్వం హయంలోనే అభివృద్ధి పారమ్మకొండ రహదారి పనులు శరవేగంగాయని శివరాత్రి కి జరిగే జాతరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగవని గిరిజన శాఖ మంత్రి,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.మంగళవారం నాడు ఆమె రహదారి ప్రారంభించారు1.64 కోట్ల రూపాయలతో నిర్మించిన రహదారి పనులు మూడు నెలలు గడవకముందే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి అప్పగించడం చాలా గొప్ప విషయమని ఆమె అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని,ఆయన ప్రోత్సాహంతో రహదారులు పూర్తి చేస్తామని,అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో రహదారులు నిర్మాణం చేపట్టి అభివృద్ధికి దోహదపడతామని తెలిపారు. అనుకున్న సమయం కంటే ముందుగా రహదారి పనులు పూర్తి కావడంతో సాలూరు నియోజకవర్గంకు సంబంధించి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు కలిసి ఆప్యాయత, అభిమానం,అనురాగాలతో ప్రజలకు అందిస్తున్న సుపరిపాలనపై మననం చేసుకున్నారు.మంత్రి సంధ్యారాణి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని ఆమె తెలియజేశారు మీరంతా మరింత కష్టపడి పనిచేయాలని కోరారు.అంతా కలిసికట్టుగా సహకరిస్తే అభివృద్ధి సాధ్యపడుతుందని ఆమె ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.అలాగే 2025 నూతన సంవత్సరం లో మీరంతా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్బంగా అందరికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.