ఎక్స్ జ్ ఎస్ ఐ నగేష్
మన న్యూస్,బిచ్కుంద, మోపెడ్‌పై దేశీదారు తరలిస్తుండగా డోంగ్లీ రోడ్డుపై సోమవారం ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎస్సై నగేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మేనూర్ నుంచి డోంగ్లీ వెళ్లే రోడ్డులో ఓ వ్యక్తి మోపెడ్‌పై దేశీదారు తరలిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో ఎక్సైజ్ పోలీసులు తనిఖీ చేసి మద్యం తీసుకెళుతున్న వ్యక్తిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 48 దేశీదారు సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. తనిఖీల్లో కానిస్టేబుళ్లు పరశురాం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.