మనన్యూస్:తిరుపతి శెట్టిపల్లిలో సోమవారం రెవెన్యూ సదస్సు జరిగింది.ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు,కలక్టర్ వెంకటేశ్వర్,మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య,రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.ఏళ్ల తరబడి భూ సమస్యను పరిష్కరించడం లేదని రైతులు,ప్లాట్ దారులు సదస్సు దృష్టికి తీసుకువచ్చారు.అలాగే రోడ్లు,తాగునీరు,డ్రైనేజీ,వీధి దీపాలు సరిగా లేవని శెట్టిపల్లివాసులు తెలిపారు.శెట్టిపల్లి భూసమస్య ను నూతన సంవత్సరంలో పరిష్కారం కావటం ఖాయమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు శెట్టిపల్లి సమస్య పరిష్కరించి అభివృద్ధి పరచాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.మంత్రి లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా శెట్టిపల్లిని ఐటి హబ్ గా తీర్చిదిద్దునున్నట్లు ఆయన చెప్పారు.రైతులు, ప్లాట్ దారులు పట్టువిడుపులతో సమస్య పరిష్కారానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.శెట్టిపల్లిని మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నుంచి తప్పించి తుడా లో కలిపేందుకు త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆయన చెప్పారు.శెట్టిపల్లిలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.తనకు ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు ఇచ్చిన శెట్టి పల్లెవాసుల మరొక్కసారి కృతజ్ఞతలు తెలిపారు.కాగా జనవరి 8వ తేదిన ఆరు లే అవుట్ లకు సంబంధించి ప్రొసీడింగ్స్ ఇవ్వనున్నట్లు కలక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. నూతన సంవత్సరంలో 85శాతం సమస్య పరిష్కారం కావటం ఖాయమని ఆయన శెట్టిపల్లివాసులకు ఆయన భరోసా ఇచ్చారు. రైతులకు ఫ్లాట్స్ కోసం 230ఎకరాలు కేటాయించినట్లు ఆయన తెలిపారు.కాలువకు దక్షణం వైపు రైతులకు కేటాయించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వానికి 95 ఎకరాలు, తుడ కు 65 ఎకరాలు కేటాయిస్తామని ఆయన తెలిపారు.ఎంజాయ్ మెంట్ లో ఉన్న వారికి ఒకటిన్నర సెంటు భూమి కచ్చితంగా అందిస్తామని ఆయన తెలిపారు.మల్టిపుల్ రిజిస్ట్రేషన్ లు ఎన్ని జరిగాయో రెవెన్యూ అధికారులు గుర్తించి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.అబ్జెక్షన్ పరుంబోకు లో ఉన్న వారికి ఎటువంటి సాయం అందించలేమని ఆయన స్పష్టం చేశారు.అయితే త్వరలో సిఎంఓ అధికారులతో సమావేశం అనంతరం పూర్తిస్థాయిలో స్పష్టత ఇస్తామన్నారు.తుడ ప్లాట్స్ అమ్మి అభివృద్ధి చేస్తాం:కమీషనర్ మౌర్య శెట్టిపల్లిలో మౌలిక సదుపాయాలు కల్పనకు తుడ చర్యలు తీసుకుంటుందని కమిషనర్ నారపురెడ్డి మౌర్య తెలిపారు.శెట్టిపల్లిలో తుడ కు కేటాయించిన భూమిలో ప్లాట్స్ వేసి అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో అభివృద్ధి చేస్తామన్నారు. శెట్టిపల్లిలో ఆరుగురితో పారిశుద్ధ్య పనులు నిత్యం చేయించనున్నట్లు ఆమె తెలిపారు. తెలుగుగంగ నీళ్లు రాత్రి 9గంటల లోపు వదిలే లా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.డ్రైనేజీ కాలువలు, వీధి దీపాల సమస్యలను స్వయంగా ఆమె శెట్టిపల్లిలో పర్యటించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు సూర సుధాకర్ రెడ్డి,బాలముని కృష్ణా,సురేష్, అముదాల తులసీ,జనసేన నాయకులు రామకృష్ణా,రాజా రెడ్డి,బిజేపీ నాయకులు వరప్రసాద్,సిపిఎం నాయకులు జయచంద్ర, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.