మన న్యూస్,నిజాంసాగర్,ఎల్లారెడ్డి, తీసుకున్న అప్పు 1.50వేల రూపాయల 30రోజుల్లో ఇవ్వకుంటే 6నెలలు జైలుశిక్ష విధిస్తూ ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు జడ్జి హారిక సోమవారం తీర్పు ఇచ్చారని కేసును వాదించిన న్యాయవాది నామ శ్రీనివాస్ చెప్పారు. నాగిరెడ్డిపేట్ మండలం రాఘవపల్లికి చెందిన మర్కంటి దుర్గయ్య కు గోవిందుగోపాల్ రెడ్డి 1.50 వేల రూపాయలు ఇవ్వగ, తిరిగి ఇవ్వకపోవడంతో కోర్టులో కేసు నమోదుకాగా, విచారణ తరువాత జడ్జి పై విధంగా తీర్పు ఇచ్చారన్నారు.