మన న్యూస్:కాకినాడ జెఎన్ టీ యు లో నిర్వహించిన 11వ రాష్ట్రస్థాయి అంతర పాఠశాలల సాంస్కృతిక పోటీల క్రియ పిల్లల పండుగలో గొల్లప్రోలు మాధురి విద్యాలయ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు బహుమతులు సాధించారు. ఈనెల 28,29 తేదీలలో కాకినాడలో రెండు రోజులపాటు నిర్వహించిన పోటీలలో ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల నుండి 10వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.ఈ పోటీలలో మాధురి విద్యార్థులు పలు ప్రోగ్రాంలలో పాల్గొని తమ ప్రతిభ ను చదువులోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా చూపించి బహుమతులు సాధించారు.పోస్టర్ ప్రజెంటేషన్ సీనియర్స్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ బహుమతిని, పోస్టర్ ప్రజెంటేషన్ జూనియర్స్ విభాగంలో మొదటి బహుమతిని, స్టోరీ అనాలసిస్ సీనియర్స్ విభాగంలో తృతీయ బహుమతిని,బుర్రకథ పోటీలలో ద్వితీయ బహుమతిని సాధించారు. కాగా రాష్ట్రస్థాయి పోటీలలో బహుమతులు సాధించిన విద్యార్థులను సోమవారం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు, ప్రిన్సిపాల్ డి మమత అభినందించి బహుమతులు అందజేశారు.