మన న్యూస్:గొల్లప్రోలు ప్రజలు మద్యానికి మాదకద్రవ్యాలకి దూరంగా ఉండి నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జిల్లా కన్వినర్ ఎన్ సూర్యానారాయణ తెలిపారు జన విజ్ఞాన వేదిక మద్యపానవ్యతిరేకప్రచార కమిటీ ఆధ్వర్యంలో సొమవారం జూనియర్ కాలేజీ విద్యార్థులతో మద్యం లేని నూతన సంవత్సర వేడుకలు జరుపుకోండి మాయదారి మందు మాకొద్దు బాబోయ్ మద్యం వద్దు ఆరోగ్యమే ముద్దు అని నినదీస్తూ ర్యాలీ నిర్వహించారు గొల్లప్రోలు ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుండి తాసిల్దార్ కె వి వి సత్యనారాయణ ప్రారంభించారు ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని కోరారు జూనియర్ కాలేజీ నుండి పాపయ్య సావిడి వీధి మెయిన్ రోడ్డు ముఖ్యమైన వీధుల మీదుగా ర్యాలీ సాగింది ఈ సందర్భంగా మద్యపాన వ్యతిరేక ప్రసార కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ ఎం సూర్యనారాయణ మాట్లాడుతూ మద్యం మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి కుటుంబ సభ్యులతో స్వీట్లు పంచుకుంటూ నూతన సంవత్సరం జరుపుకోవాలని యువతరాన్ని రక్షించమని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమని మహిళల కన్నీళ్లు తూడవమని ప్రజల కోణం నుంచి ఆలోచించ మనీ రాజకీయం కోన నుంచి ఆర్థిక కోణం నుంచి ఆలోచించ వద్దని తాగి వాహనం నడిపితే తప్పు తాగిన డబ్బులతో ప్రభుత్వాలు నడపొచ్చా ఇది రాజ్యాంగబద్ధమేనా రాజ్యాంగం హర్షిస్తుందా ఎన్నుకోబడిన మీరు రాజ్యాంగానికి బద్ధులై ఉండని మీ దృష్టికి తీసుకు వస్తున్నాం ప్రజల మీద ప్రేమ ఉంటే డిసెంబర్ 31రాత్రి మద్యం షాపులు మూసివేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక మండల అధ్యక్షులు ఏలేటి నాని బాబు గౌరవ అధ్యక్షులు దాడి పద్మనాభం కాలేజీ ప్రిన్సిపాల్ గోవింద రాజు లెక్చలర్లు ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వడ్డీకాసులు అప్పారావు కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు