మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ , నిజాంసాగర్ మండల స్థాయిలో సోమవారం సోషల్ ట్యాలెంట్టెస్ట్ నిర్వహించారు.ఈ మండల స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ లో తెలుగులో మొదటి స్థానం అంజన సౌమ్య మల్లూర్,ద్వితీయ స్థానం భానుప్రియ,తృతీయ స్థానం దీపక్ ,ఇంగ్లీష్ మీడియం మొదటి స్థానం గజానంద్, ద్వితీయ హరిప్రియ ,తృతీయ శివరాం,పి.నితిష లు వచ్చారని ఎంఈఓలు అమర్ సింగ్ ,తిరుపతిరెడ్డి లు అన్నారు. ఈ పోటీలో నిజాంసాగర్ మండలంలోని ఆయా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థినిలకు బహుమతులు అందజేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాంచందర్,ఉపాద్యాయులు సమత, శైలజ,గౌస్,సంతోష్ తదితరులు ఉన్నారు.