మనన్యూస్:ప్రత్తిపాడులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్య ప్రభ రాజా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు నాల్గొవ స్థంభంగా పిలువబడే పాత్రికేయ రంగం ఎంతో విలువలతో కూడిన మరియు కత్తి మీద సాము వంటిదని అన్నారు.ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేసే ఏకైక వ్యవస్థ పాత్రికేయరంగమని అన్నారు.ప్రభుత్వాలు చేసే ప్రజోపయోగకర విధానాలను ప్రశంసిస్తూనే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే ధైర్యమున్న రంగమని అన్నారు.అటువంటి రంగాన్ని ఎంచుకున్న మీరు ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి మాతో పాటు మీరు కూడా తోడ్పాటునందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టిడిపి రాష్ట్ర కమిటీ కార్యదర్శి వత్సవాయి సూర్యనారాయణ రాజు (మీసాల రాజు),ప్రత్తిపాడు మండల టిడిపి అధ్యక్షులు అమరాది వెంకటరావు, ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి), ఏలేశ్వరం మండల మాజీ జెడ్పీటీసీ జ్యోతుల వీరాస్వామి (పెదబాబు), ఏలేశ్వరం నగర పంచాయితీ కౌన్సిలర్ బొదిరెడ్డి గోపి,శంఖవరం మండల టిడిపి అధ్యక్షులు బద్ది రామారావు,బద్ధి రమణ,టిఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెన్నా ఈశ్వరుడు (శివ), శంఖవరం మండల టిడిపి సీనియర్ నాయకులు పర్వత సురేష్,లంపకలోవ సొసైటీ మాజీ చైర్మన్ గొంతిన సురేష్,కార్మిక నాయకులు పత్రి రమణ,యువ నాయకులు యాళ్ల జగదీష్,యర్రాబత్తుల గోవిందునాయుడు,వెలుగుల నాని,అంబటి బుజ్జి,బొల్లు మనోజ్,పాల్గొన్నారు.