మనన్యూస్:తిరుపతి సనాతన ధర్మాన్ని ప్రతి ఇంటికి భజనమండలి సభ్యులు తీసుకెళ్ళాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు.తిరుపతి ఆధ్యాత్మిక శోభ మరింత ఉట్టిపడేలా నగర సంకీర్తన జానపద వృత్తి కళాకారుల సంఘం నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు.జానపద వృత్తి కళాకారుల సంఘం జాతీయ సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది.ఈ సంఘం జాతీయ గౌరవ అధ్యక్షులుగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను ఎన్నుకుంది.ఈ నేపథ్యంలో జాతీయ కమిటీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను ఆయన నివాసంలో కలిసి సన్మానించింది.2022 నుంచి హిందూ ధర్మప్రచార పరిషత్ లో కొత్త భజన మండళ్ళ నమోదును చేస్తామని టిటిడి ఉత్తర్వులు ఇచ్చినా అమలు పరచడం లేదని జానపద వృత్తి కళాకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు యాదగిరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.అలాగే ధర్మప్రచార పరిషత్ లో రెండు లక్షల మంది సభ్యత్యం ఉందని కావున డిపిపి కార్యనిర్వాహక వర్గంలో తమకు ప్రాతినిథ్యం కల్పించాలని ఆయన కోరారు. జాపపదవృత్తి కళాకారుల సంఘంకు స్థలం కేటాయించి భవన నిర్మాణానికి సహకరించాలని ఆయన విజ్జప్తి చేశారు. సనాతన ధర్మాన్ని ప్రతి ఇంటికి చేర్చాలని భజనమండళ్ళ సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. సనాతన ధర్మాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు కృతనిశ్చయంతో ఉన్నారని ఆయన తెలిపారు జానపద వృత్తి కళాకారుల సంఘం సమస్యలను టిటిడి ఛైర్మన్, ఈఓ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన హామి ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారు నరసింహులు నాయుడు, కార్యదర్శి మునేంద్ర, ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి సహాయ కార్యదర్శి నారాయణ, నాగమల్లెలు,నగేష్, మహదేవ రావు, రవిచంద్రా రెడ్డి, జయప్ప అంజలయ్య వెంకటలక్హీ, కవిత తదితరులు పాల్గొన్నారు.