మన న్యూస్:తిరుపతి ప్రత్యేక ప్రతిభావంతుల విజేతలకు బహుమతులు వివిధ రకాలుగా సాయం చేసిన వారికి సత్కారం,వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి ఘన సన్మానం చేసిన ఘనత శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సైదమ్మ(శైలజ)కు దక్కుతుందని రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మానవత సంస్థ తిరుపతి శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి సుకుమార్ రాజు పేర్కొన్నారు.ఆదివారం స్థానిక యూత్ హాస్టల్లో శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా తమ సంస్థకు హితోదికంగా సాయం చేసిన వారికి సైదమ్మ (శైలజ) చేతుల మీదుగా ప్రశంసా పత్రంతో పాటు మెమెంటో అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.ప్రత్యేక ప్రతిభావంతులకు శైలజ అందిస్తున్న సేవలను పలువురు కొనియాడారు.ఆమె అంగవైకల్యంతో ఉన్న ఆమె చేస్తున్న సేవలు అందరికీ ఆదర్శనీయమని,ఆ భగవంతుని ఆశీస్సులు ఆమెకు మెండుగా ఉండాలని పలువురు వక్తలు పేర్కొన్నారు.శైలజా సేవలను ఆదర్శంగా తీసుకుని నేటి యువతీ యువకులు మార్గదర్శకంగా నిలవాలన్నారు.డాక్టర్ నారాయణస్వామి,కీర్తన,ఎస్సై పి సుమతి, కొమ్మే రేవంత్ సాయి యాదవ్,రవ్వ శ్రీనివాసులు, హేమాక్షిలను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ప్రత్యేక ప్రతిభావంతులకు జరిగిన వివిధ పోటీల్లో గెలుపొందిన ఇందు,రజియా, కకోన్ భయ్యా,గుప్తా,లక్ష్మమ్మ,ఇంద్రాణి,జనార్ధన్, మదప్ప,భాను,ప్రకాష్,మహేష్,వీణ,దుర్గా,ప్రియాంక,రాజేష్ కుమార్,సెల్వా, గౌరీ తదితర విజేతలకు శైలజ బహుమతులు అందజేశారు.