మనన్యూస్:తిరుపతి రాష్ట్రవ్యాప్తంగా మానవత స్వచ్ఛంద సేవా సంస్థ వివిధ రంగాలలో అందిస్తున్న సేవలు అద్వితీయమని తుడా ఎస్ ఈ ఎన్ వెంకట కృష్ణారెడ్డి కొనియాడారు.ఆదివారం జరిగిన మానవతా నెలవారీ సమావేశానికి ఆయన ముఖ్యతిథిగా హాజరై ప్రసంగించారు.రాష్ట్రవ్యాప్తంగా 124 యూనిట్ల ద్వారా 80 వేల మంది సభ్యులతో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించాలని పేర్కొన్నారు. తిరుపతి మానవతా శాఖ ప్రగతికి తమ వంతు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారు.సంస్థలో సభ్యుల సంఖ్య పెంచి సేవలు మరింత విస్తృతం చేయాలని సూచించారు.ఇటీవల శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ కు మానవత సంస్థతోపాటు విరాళం అందించిన రిటైర్డ్ ఎస్సై సుధాకర్ బాబును మానవత సంస్థ సభ్యులు ఘనంగా సత్కరించారు.పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ప్రజలు చేపట్టాల్సిన చర్యలను లైన్స్ క్లబ్ సభ్యులు కోల ముని దామోదరం సోదాహరణంగా వివరించారు.బాడీ ఫ్రీజర్ల రవాణాకు, శాంతి రథంను విరివిగా వినియోగించేందుకు తీసుకోవలసిన చర్యల గురించి మానవత సభ్యులు పలు సూచనలు చేశారు.ఈసమావేశంలో మానవత సంస్థ సెంట్రల్ కమిటీ డైరెక్టర్ ఎన్ వి కృష్ణారెడ్డి,చైర్మన్ భార్గవ,అధ్యక్ష కార్యదర్శులు ఎం.వి రమణ,సుకుమార్ రాజు,కోశాధికారి భాస్కర్ రెడ్డి,సభ్యులు ఎల్ఐసి పద్మనాభం, రిటైర్డ్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ రెడ్డి,రిటైర్డ్ టీటీడీఏఈ రమణయ్య,భాగ్యలక్ష్మి,సుధాకర్ బాబు,గోపి, ముని దామోదరం తదితరులు పాల్గొన్నారు.