మన న్యూస్,నిజామాబాద్, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు జిల్లాలో ఘన స్వాగతం లభించింది. దాదాపు పది నెలల తరువాత ఇందూర్ కు వస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ధ అదివారం రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, బోదన్ బిఆర్ఎస్ నేత అయోషా పాతిమాలు గజమాలతో స్వాగతం పలికారు. కవితకు స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కవితకు జిందాబాద్ నినాధాలతో హోరేత్తింది. అక్కడి నుంచి ర్యాలిగా నిజామాబాద్ కు బయలు దేరారు.