. బంగారుపాళ్యం,డిసెంబర్ 28 మన న్యూస్
బంగారుపాళ్యం మండల పరిధిలోని మొగిలివారిపల్లి ఉన్నత పాఠశాల ఆట స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించాలని ప్రయత్నం చేయడం హేయమైన చర్యని మండల టిడిపి అధికార ప్రతినిధి మంజునాథ్ విమర్శించారు.పాఠశాలకు సంబంధించిన ఆట స్థలాన్ని తన తండ్రి బాలగోపాల నాయుడు 08/07/2013 తేదీన ఉచితంగా పాఠశాలకు రిజిస్టర్ చేయించి దానంగా ఇచ్చాడని తెలిపారు.ఆ స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇటువంటి చర్యలను తాము సహించబోమని హెచ్చరించారు.ఈపాఠశాలలో 193 మంది విద్యార్థులు చదువుతున్నారని,ఇంత మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమని తెలిపారు.ఇకనైనా ఇలాంటి చర్యలను వదులుకోవాలని హెచ్చరించారు.