మనన్యూస్:ఏలేశ్వరం పట్టణ బిజెపి అధ్యక్షుడిగా పైల అయ్యప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.స్థానిక బిజెపి కార్యాలయంలో జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు ఉమ్మడి వెంకట్రావు ఆధ్వర్యంలో పట్టణ బిజెపి అధ్యక్షుని నియామక ఎన్నికలు శనివారం నిర్వహించారు.అధ్యక్ష ఎన్నికల లో భాగంగా ముగ్గురు అభ్యర్థులు అధ్యక్ష స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.ముగ్గురు అభ్యర్థులలో పైల అయ్యప్ప చింతల పాండవులు రౌతు వెంకన్న బాబు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినప్పటికీ చిట్టచివర్లో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ఉ పసంహరించుకున్నారు.దీంతో పైల అయ్యప్ప ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.ఈ మేరకు ఏలేశ్వరం టౌన్ రిటర్నింగ్ ఆఫీసర్ గా వ్యవహరించిన ఉమ్మిడి వెంకట్రావు అయ్యప్పను పట్టణ బిజెపి అధ్యక్షుడిగా ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కామినేని జయ శ్రీ, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ మట్టా మంగరాజు,ఏలేశ్వరం టౌన్ ఎలక్షన్ అబ్జార్వర్ సింగిలిదేవి సత్తిరాజులు ఎన్నికైన ధ్రువీకరణ పత్రం ఇచ్చి ఏలేశ్వరం టౌన్ అధ్యక్షునిగా పైల అయ్యప్పను నియమించారు.ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ బిజెపి నాయకుడు పైల సుభాష్ చంద్రబోస్,గిడిజాల రాజా,బాబి, దొర, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.