మనన్యూస్:ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్అ ధినేత,నియోజకవర్గ వైసీపీ నాయకులు ముదునూరి మురళీ కృష్ణంరాజు పలువురిని పరామర్శించారు.ప్రత్తిపాడు మండలం వాకపల్లి రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో వాకపల్లి గ్రామానికి చెందిన మురుకుర్తి రాణిని పరామర్శించి,మెరుగైన వైద్యం అందించాలని వైద్యులని కోరారు.అదే గ్రామానికి చెందిన మురుకుర్తి అప్పన్న రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులని పరామర్శించి ముదునూరి ఓదార్చారు ధర్మవరం గ్రామంలో చర్చి నడుపుతున్న కత్తిపూడి గ్రామానికి చెందిన బంగార్రాజు పాస్టర్ ని కాకినాడ సిద్ధార్థ హాస్పిటల్లో పలకరించి ఓదార్చారు.ప్రత్తిపాడు గ్రామానికి చెందిన మెడికల్ ల్యాబ్ అధినేత జంపా త్రిమూర్తులు తండ్రి జంపా వెంకటేశ్వరావు ఇటీవల స్వర్గస్తులవ్వడంతో వారి కుటుంబ సభ్యులను కూడా ముదునూరి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో బర్ల గోవింద్,మాజీ ఉప సర్పంచ్ అవ్వ ఆదినారాయణ,జువ్వల దొరబాబు,బొల్లు నాగేశ్వరరావు,మాగాపు శివ తదితరులు పాల్గొన్నారు.