
కొడవలూరు, మన ధ్యాస, నవంబర్ 28 : నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం, గుండాలమ్మ పాలెం గ్రామపంచాయతీ కు 2. 12 . 20 26 బుధవారం జరగబోవు పంచాయతీ ఎన్నికలలో కూటమి మద్దతుదారులైన అభ్యర్థిగా మందల శ్రీదేవి పోటీ చేయుచున్నారు.నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కొడవలూరు నాయకులు, మాజీ మండల అధ్యక్షులు కోటంరెడ్డి అమరేంద్ర రెడ్డి సహాయ సహకారాలతో మందల శ్రీదేవి శనివారం సాయంత్రం గుండాలమ్మ పాలెం, గాంధీనగర్ కాలనీ లో ఇంటింటికి తిరిగి తన కు ఓటు వెలసిన ఓటర్లు అభ్యర్థించారు. గుండాలంపాలం పంచాయతీ అభివృద్ధి మందల శ్రీదేవి కే సాధ్యమని కోటంరెడ్డి అమరేంద్ర రెడ్డి తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గుండాలంపాలం పంచాయతీ అభ్యర్థి చెందాలంటే మందల శ్రీదేవిని సర్పంచిగా గెలిపించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది అని తెలియజేశారు.ఎస్టి జనరల్ అయిన ఈ పంచాయతీలో ఎనిమిది వార్డులో 1060 ఓట్లు ఉన్నాయి. మందల శ్రీదేవి గుర్తు కత్తెర మంజూరు అయినది... కావున కత్తెర గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి మందల శ్రీదేవిని సర్పంచిగా గెలిపించవలసినదిగా కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో భారీ సంఖ్యలో కూటమి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




