
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని స్థానిక రైల్వే రోడ్డులో ఉన్న పూలే విగ్రహం వద్ద మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు, ప్రముఖులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు సమాజానికి చేసిన సేవలను, విద్యా రంగంలో వారు తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను వక్తలు కొనియాడారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా సమానత్వ సమాజ నిర్మాణం కోసం పూలే చేసిన కృషి చిరస్మరణీయమని, మహిళా విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. పూలే ఆశయాలను కొనసాగిస్తూ విద్య, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ కమిటీ అధ్యక్షులు అవుల కోటేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు డి. శివకామ ప్రసాద్, నూకసాని వెంకటేశ్వర్లు, అంబటి బ్రహ్మయ్య, డాక్టర్ అర్రిబోయిన రాంబాబు, కీర్తి శ్రీనివాసరావు, చిలకపాటి సుధాకర్, పులి ప్రసాద్, అంబటి ప్రసాదరావు, మసనం మాలీరావు, అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు, పూలే అభిమానులు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.