

విశాఖ మన ధ్యాస ప్రతినిధి నవంబర్ 28 :నవ నిర్మాణ సమితి - నర్సీపట్నం వారి ఆధ్వర్యంలో గూగుల్ డేటా సెంటర్ వారి ఆర్థిక సహాయంతో ఆరిలోవ 16వ డివిజన్ ప్రాంతంలో 10 స్కూళ్లలో త్రాగునీటి సదుపాయాలు కల్పించుటకు ముందుకు రావడం జరిగింది.అందులో భాగంగా ఆరిలోవ ఆపరేషన్ కోలనీలో బాల్యం విద్యా కేంద్రంలో బోర్ త్రవ్వి,మోటార్ వేసి సింటెక్స్ ట్యాంక్లో స్టోరేజ్ చేసి,స్టాండ్ పోస్ట్ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి 16వార్డు కార్పొరేటర్ శ్రీమతి ఏడువాక శ్రీమహాలక్ష్మి సన్యాసిరావు దంపతులు చేతుల మీదగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా16వార్డు కార్పొరేటర్ ఏడువాక శ్రీమహాలక్ష్మి,సన్యాసిరావు దంపతులు మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం అనంతరం వార్డ్ అభివృద్ధిలో భాగంగా మంచి నీటి బోరు శంకుస్థాపన ప్రారంభోత్సవం జరిగిందని ఇది వార్డ్ అభివృద్ధికి శుభ పరిణామమని అన్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వ సహకారంతో వార్డులో మరింత అభివృద్ధి చర్యలు చేపట్టే విధంగా ఉంటాయి. ముఖ్యంగా నాణ్యమైన విద్యతో పాటు మంచినీటి సదుపాయం కూడా ముఖ్యమని ఎంత ఉదార స్వభావంతో పిల్లలకు మంచి నీటి సదుపాయం కల్పించి సంతోషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో 16వ వార్డు టీడీపీ ప్రధాన కార్యదర్శి తురకపూడి బాలస్వామి,టీడీపీ సీనియర్ నాయకులు కెల్లా సత్యనారాయణ సంస్థ ఇంజనీర్ విజయకుమార్,సిబ్బంది మరియు టీడీపీ నాయకులు కిల్లంశెట్టి శ్రీనివాస్,తెలుగుయువత అధ్యక్షులు వాడిసేలా శ్రీనివాస్,ఓశెట్టి పైడిరాజు,కొండల గోవింద్,మీసాల గిరిబాబు,రామరాజు స్వామి,శివ,హిబ్రా,సాయికిరణ్,గురజాపు వాసు, భాయిశెట్టి యోగి తదితరులు పాల్గొన్నారు.