
కలిగిరి నవంబర్ 5 (మన ధ్యాస RC ఇన్చార్జి నాగరాజు):*
నెల్లూరు జిల్లా కలిగిరిలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు డివైడర్ వద్ద యాక్సిడెంట్ జరగడం వలన డివైడర్ రోడ్డుకి అడ్డంగా పడిపోయి ఉంది.కలిగిరి లో ఓ ప్రవేట్ స్కూల్ వ్యాన్ వాహనం సాయంత్రం 3:45 నిముషాలు టైమ్ఢీ లో కొనడంతో డివైడర్ ఉన్న స్థానం నుండి తొలగి రోడ్డు మధ్యలో అడ్డంగా పడింది అని స్థానికులు తెలుపుతున్నారు.దీంతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళ,స్థానిక వాసులు పలు ఊర్ల నుండి రాక పోకల చేస్తున్న ప్రజలకు మరియు ఆసుపత్రికి వచ్చే అంబులెన్స్ లకు, రోగులకు ఈ డివైడర్ పెద్ద ప్రమాదంగా మారింది.అడ్డంగా పడిన డివైడర్ ను గమనించకపోతే మరో ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆ చుట్టుపక్కల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు ఆ ప్రాంతంలో జాగ్రత్తగా, నెమ్మదిగా వెళ్ళాలని స్థానికులు కోరుతున్నారు.దీనికి సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి డివైడర్ ను సరిచేయవలసిందిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇంకో ప్రమాదం జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
