
మన ధ్యాస,మక్తల్: మున్సిపాలిటీ పరిధిలో 16వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథక నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. శుక్రవారం ఆనంపల్లి వీధిలో మాజీ ఉప సర్పంచ్, సీనియర్ నాయకులు కట్టా సురేష్ గుప్తా బీమా పథక నమోదు ప్రక్రియ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు మున్సిపాలిటీ 16వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు లో భాగంగా ఇప్పటి వరకు 250 మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. కుటుంబ పెద్ద కు 5 లక్షల రూపాయల జీవిత బీమా వర్తించేలా పథకాన్ని తీసుకొచ్చామని అన్నారు. గతంలో రైతు బీమా కేవలం భూమి ఉన్న వారికి మాత్రమే ఉండేదని, భూములు లేని వారి కోసం ఈ పథకం ఉపయోగ పడుతుందని అన్నారు. రైతు బీమా, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం రెండింటిలో ఒకటి మాత్రమే ఎంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు అలుకూరి రవికుమార్, మార్కెట్ డైరెక్టర్ శాలం, స్థానిక నాయకులు వలి , మహమ్మద్, రాము, నర్సింహా, శేఖర్, రాములు, భాస్కర్, నీలి రాము, అంజాద్, మందపాల్ రాము, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ విష్ణు, జగదీశ్ ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు..