
మన ధ్యాస,మక్తల్: మున్సిపాలిటీ 16వ వార్డులో. మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు,గురువారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి. గణేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజయ్య, తో కలిసి స్థానిక వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి బీమా ఉండాలనే ఉద్దేశంతో,సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా కల్పించే విధంగా,ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. గతంలో రైతు బీమా, మరికొందరి వర్గాలకు బీమా పథకాలు ఉండేవని, భూములు లేని వారు ఇతర చాలా వర్గాల వారు బీమా పొందలేకపోయారని,వారందరిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కనీసం ఐదు లక్షల జీవిత బీమా వర్తించేలా,ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని తీసుకొచ్చారని అన్నారు. ప్రతి ఇంటిలో కుటుంబ పెద్ద కు బీమా వర్తిస్తుందని, ఎవరి పేరిట బీమా తీసుకోవాలో కుటుంబ సభ్యుల నిర్ణయించుకోవాలని సూచించారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ జీవిత బీమా కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ఖాదర్,మున్సిపల్ ఏఈ నాగశివ.కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ అల్కూరి రవికుమార్, కో ఆప్షన్ మెంబర్ వల్లంపల్లి లక్ష్మణ్, శంషుద్దీన్, ఉషాముద్దీన్ మిస్కిన్ నాగరాజ్, మార్కెట్ డైరెక్టర్ శాలం, వార్డు ఆఫీసర్ విష్ణప్ప, జగదీష్,స్థానిక నాయకులు,రమేష్, రాజశేఖర్, గోపాల్, మహమ్మద్, వలి, అన్వార్,గఫార్, కిరాలింగ, అక్తర్ తదితరులు పాల్గొన్నారు.