మనన్యూస్:విద్యార్థులు చదువులో ఆటల్లో రాణించాలి సెయింట్ జార్జెస్ స్కూల్ చైర్మన్ మహమ్మద్ ఇస్మాయిల్ ఎల్బీనగర్ సెయింట్ జార్జ్ స్కూల్ లో లయన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ కొత్తపేట జిల్లా 320-D ఆధ్వర్యంలో ఈ నెల ప్రపంచ మాథమాటిక్స్ డే సందర్బంగా వ్యాస రచన పోటీలు,ఆటల,పోటీలలో గెలుపొందిన ఉత్తమ ప్రథమ,ద్వితీయ, విజేతలకు విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్స్,మెడల్స్ ను అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ లయన్ డాక్టర్ బి విజయ్రం గ,లయన్ సైకం రేణుక రెడ్డి జోన్ చైర్మన్,లయన్ మొహమ్మద్ ఇస్మాయిల్ పాఠశాల చైర్మన్ మొహమ్మద్ నయాజ్ పాల్గొని బహుమతులు అందజేశారు.లయన్ విజయ్ రంగ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవ లలో భాగంగా ప్రతి నెల జిల్లా గవర్నర్ లయన్ నగేష్ ప్రోత్సాహముతో ఆరోగ్య శిభిరలు,మానసిక వ్యక్తిత్వ వికాస అవగాహనా కార్యక్రమాలు ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము అని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టత్మాకముగా తీసుకున్న మత్తు డ్రగ్స్,గంజాయి, లా గురించి చెడు అలవాట్ల నుండి యువతను స్కిల్ డెవలప్మెంట్ సదస్సులు నిర్వర్తిస్తూ ఇకముందు ఇలాంటి అవగాహన సదస్సులను యువతకి,విద్యార్థులకి, నిర్వర్తించి తమవంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.