కూటమి నేతలతో కలిసి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి..
మేయర్గా జేబీ శ్రీనివాస్ ,డిప్యూటీ మేయర్గా పాలడుగు విజయ ప్రమాణస్వీకారం...
66 డివిజన్ల కార్పొరేటర్లతో ప్రమాణం చేయించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ....
తిరుపతి..
డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ , కమిషనర్ జయకృష్ణ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా సాగిన కార్యక్రమం ఆధ్యాత్మిక నగరం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలనలో నేడు ఒక నూతన శకానికి నాంది పలికింది. ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో అత్యంత కోలాహలంగా, పండుగ వాతావరణంలో నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తో కలిసి నూతన మేయర్ జేబీ శ్రీనివాస్ ని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి నేతల ఐక్యత, కార్యకర్తల ఉత్సాహం నడుమ ఆడిటోరియం ప్రాంగణమంతా జయజయధ్వానాలతో మారుమోగింది.
తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ,తిరుపతి మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ సమక్షంలో రాజ్యాంగబద్ధంగా ప్రమాణస్వీకారం చేయించారు. తొలుత నగర ప్రథమ పౌరుడిగా,మేయర్గా జేబీ శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్గా పాలడుగు విజయ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.అనంతరం నగరంలోని 66 డివిజన్లకు చెందిన నూతన కార్పొరేటర్ల చేత జిల్లా కలెక్టర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, నూతన కార్పొరేటర్ల కుటుంబ సభ్యులు మరియు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు.

