
మన ధ్యాస, మక్తల్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు సోమవారం రోజు మాగనూరు మండల పరిధిలోని అమ్మపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ నరసింహ, ఉప సర్పంచ్ బలరాం ఘనంగా ప్రారంభించారు . మగనూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివరాం రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి బి.రవికుమార్ ,గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కృష్ణ హాజరై ఇట్టి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాతూ,.రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కుటుంబ భద్రత, ఆర్థిక భరోసా లక్ష్యంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివరాం రెడ్డి మాట్లాడుతూ,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల ముందుకు వెళ్తుందని అన్నారు. గత పదేళ్ల పాలనలో ప్రజలకు అందని సంక్షేమ పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొస్తుందని తెలిపారు.గ్రామపంచాయతీ కార్యదర్శి బి. రవికుమార్ మాట్లాడుతూ,పేద మరియు మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబం జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు .ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు.గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కృష్ణ మాట్లాడుతూ ,ప్రజలకు మెరుగైన సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు . వయోవృద్ధులకు సైతం త్వరలో పెన్షన్లు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వెల్లడించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి మేడం మమత , మరియు గ్రామ వివిధ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.