మన న్యూస్, ఎస్ఆర్ పురం:-
కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా లేదు చంద్రబాబు దోపిడి ప్రభుత్వం గా ఉంది నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ కృపాలక్ష్మి విద్యుత్ చార్జీల పెంపు పై వైఎస్ఆర్సిపి నాయకులు పోరుబాట కార్యక్రమం మన న్యూస్,ఎస్ఆర్ పురం కార్వేటినగరం మండలం కేంద్రంలో కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీల పెంపు పై వైఎస్ఆర్సిపి మాజీ ఉప ముఖ్యమంత్రి కుమార్తె జీడి నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కృపా లక్ష్మి పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకాలు దోపిడీలు ఎక్కువ అయ్యాయని అన్నారు. ఈ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం గా లేదు. చంద్రబాబు దోపిడీ ప్రభుత్వం లా ఉందని అన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచబోమని చెప్పి నేడు విద్యుత్ చార్జీలను పెంచడం దారుణమని వెంటనే విద్యుత్ ఛార్జీలను చార్జీలను తగ్గించాలంటూ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున డిమాండ్ చేశారు. అనంతరం కార్వేటినగరం నుండి AD ఎలక్ట్రికల్ ఆఫీస్ వద్ద వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రాన్ని అందించారు. అంతకు ముందుగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ లతా బాలాజీ, నాయకులు ధనుంజయ వర్మ, మాజీ జెడ్పిటిసి గురువారెడ్డి, సరిత జనార్ధన్, పెనుమూరు మండల అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి , వెదురుకుప్పం జడ్పిటిసి సుకుమార్, వేల్కూరు బాబు రెడ్డి, పేట ధనుంజయ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.