ఎడిటర్: యస్. చంద్రశేఖర్ || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ || నవంబర్ 23, 2026, 4:57 pm
ప్రజావాణి ఆర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి,జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక

- రాష్ట్రస్థాయిలోనూ ప్రజావాణి దరఖాస్తుల పర్యవేక్షణ.
- మన ధ్యాస, మక్తల్: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను రాష్ట్రస్థాయిలోనూ పర్యవేక్షణ చేస్తున్నారని, సంబంధిత అధికారులు వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక అన్నారు.సోమవారం మండల్ ప్రజావాణి సందర్భంగా మక్తల్ ఎంపిడిఓ లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించకపోవడంతో చాలామంది ప్రజలు అవే సమస్యలపై తిరిగి వస్తున్నారన్నారు. ఆయా ఆర్జీలను తిరస్కరించాల్సి ఉంటే అందుకు గల కారణాలను నిబంధనల ప్రకారం తెలియజేయాలని, ఆర్జీదారులకు ఏ విషయం చెప్పకుండా దరఖాస్తులను అలాగే వద్ద ఉంచుకోవడం సరికాదన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://www.mananews.co.in