
నెల్లూరు, మన ధ్యాస, నవంబర్ 22 : నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో శ్రీ హర్ష టైర్స్ ఆధ్వర్యంలో ఎంఆర్ఎఫ్ టైర్స్ అండ్ సర్వీసెస్ రెండో షోరూం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులు, షోరూం నిర్వాహకులు కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఆర్ఎఫ్ రీజనల్ సేల్స్ మేనేజర్ రెను వర్గీస్, జిల్లా మేనేజర్ విష్ణు సాయిలు మాట్లా డుతూ.... హర్ష టైర్స్ యాజమాన్యం రెండో షోరూంను ప్రారంభించడం అభినందనీ యమన్నారు. భారతదేశంలోని రహదారుల పరిస్థితులకు అనుగుణంగా ఎంఆర్ఎఫ్ టైర్లను అత్యాధునిక సాంకేతికతతో తయారు చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యత, మన్నిక, భద్రతకు ఎంఆర్ఎఫ్ టైర్లు ప్రాధాన్యత ఇస్తాయని పేర్కొన్నారు. వాహనదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల టైర్లు అందుబాటులో ఉన్నాయని వివరిం చారు. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులతో పాటు మెరుగైన సేవలు అందిం చడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. నెల్లూరు జిల్లా ప్రజలు చిల్డ్రన్స్ రోడ్డులోని హర్ష టైర్స్ రెండో షోరూంను సందర్శించి తమ సేవలను ఆదరించాలని ముఖ్య అతిథులు కోరారు. ఈ కార్యక్రమంలో హర్ష టైర్స్ ప్రతినిధులు హరికుమా ర్రెడ్డి, లీల మునుష్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.


ఏ
