మనన్యూస్:నిజాంసాగర్ జుక్కల్ మన్మోహన్ సింగ్ చేసిన సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ అన్నారు.నారాయణఖేడ్ నియోజక వర్గం లోని ఎంపీ షేట్కార్ స్వగృహంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ. ఆర్థిక మంత్రిగా,ఆపై పదేళ్లపాటు ప్రధానిగా ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశాన్ని ద్రవ్యోల్బణ గండం నుంచి గట్టెక్కించారని,దేశ పురోభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు.
కీలక చట్టాలకు ఆధ్యులు2004లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ సింగ్ పదేళ్లపాటు ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేశారని గుర్తు చేశారు.సంక్షేమానికీ పెద్దపీట వేశారని అన్నారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కోట్లాదిమంది పేద ప్రజలకు పని చూపించి. వారి ఆకలి బాధలు తీర్చారని అన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసం 2005 లో సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారని అన్నారు. విద్యాహక్కు చట్టం, భూసేకరణ చట్టాలతో ప్రజలకు మేలు జరిగేలా చూశారని అన్నారు. మన్మోహన్ సింగ్ ముందుచూపు ఉన్న నేత అని,మచ్చలేని విశిష్ట నేతను కోల్పోవడం ఎంతో బాధాకరమని ఎంపీ అన్నారు.ఈ కార్యక్రమంలో
నారాయణాఖేడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాహిర్ అలీ,మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్,నారాయణాఖేడ్ నియోజికవర్గం ఎస్టీ సెల్ అధ్యక్షులు నెహ్రు నాయక్, నారాయణాఖేడ్ నియోజికవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు సాయిలు,మాజీ జడ్పీటీసీ చందర్ నాయక్,పురంజాన్,మాజీ సర్పంచ్ నారాయణ, విట్టల్ రెడ్డి, నొమన్ డ్యానియల్,విఠల్ నాయక్,సంతాప్ప,సురేష్ షెట్,తదితరులు ఉన్నారు.